“సర్కారు వారి పాట” షూటింగ్ స్పాట్‌లో మహేశ్‌ని కలిసిన ఎంపీ శశిథరూర్..!

Published on Sep 8, 2021 9:13 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్‌లో తాజాగా మహేశ్ బాబును కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కలిశారు. శశి థరూర్‌తో పాటు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు కాసేపు ముచ్చటించారు.

ఇదిలా ఉంటే మైత్రి మూవీస్ సంస్థ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. గత నెలలో మహేశ్ పుట్టిన రోజు కానుకగా సర్కారు వారి పాట నుంచి విడుదలైన బర్త్ డే బ్లాస్టర్ రికార్డ్‌లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :