“కేజీయఫ్ 2” పై మిస్టర్ బాక్సాఫీస్ ఇంట్రెస్టింగ్ వ్యూ.!

Published on Apr 23, 2022 4:00 pm IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న మరో చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకి మన టాలీవుడ్ ఆడియెన్స్ మరియు సినీ ప్రముఖులు నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మరి నిన్ననే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పగా ఇప్పుడు మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ తన వ్యూ ని ఈ సినిమాపై తెలియజేసాడు. నా బ్రదర్ ప్రశాంత్ నీల్ మరియు హోంబలే పిక్చర్స్ వారికి మాసివ్ సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతున్నానని.

అలాగే నా డియర్ బ్రదర్ యష్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడు అని అలాగే సంజయ్ దత్ రవీనా టాండన్ మరియు ప్రకాష్ రాజ్ రావు రమేష్ లు తమ బెస్ట్ వర్క్ అందించారు అని అలాగే శ్రీనిధి శెట్టి, నటి అర్చన లు ఫెంటాస్టిక్ వర్క్ అందించారు అని చరణ్ తెలిపి వీరి అందరికీ కంగ్రాట్స్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :