వైరల్ అవుతున్న మిస్టర్ బాక్సాఫీస్ సాలిడ్ పోస్టర్.!

Published on Jan 11, 2022 12:00 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ మార్కెట్ దగ్గర తన స్టార్డం ని విస్తరింపజేయడానికి రెడీ అవుతున్న డైనమిక్ హీరో రామ్ చరణ్ కూడా ఒకడు. అభిమానులు మెగా పవర్ స్టార్ మిస్టర్ బాక్సాఫీస్ గా పిలుచుకునే రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉండగా ప్రస్తుతం చరణ్ చిన్న వెకేషన్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

మరి ఇదిలా ఉండగా రీసెంట్ కొన్ని రోజుల్లో తన ఫ్రెష్ లుక్స్ తో మంచి ట్రీట్ ఇచ్చిన చరణ్ నటించిన లాస్ట్ సినిమా “వినయ విధేయ రామ” నుంచి తన మాస్ టైటిల్ మిస్టర్ బాక్సాఫీస్ అనే పదానికి అద్దం పట్టేలా ఉన్న పోస్టర్ ఇప్పటి వరకు చూడనిది బయటకొచ్చి వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బోయపాటి శ్రీను తీసిన ఒక ఇంటెన్స్ భారీ ఫైట్ సీక్వెన్స్ లో చరణ్ మెషిన్ గన్ తో ఉన్న పోస్టర్ ఇది. దీనిలో చరణ్ మరింత మాస్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజుతో రిలీజ్ అయ్యి మూడేళ్లు అవ్వడంతో ఈ కొత్త అన్ సీన్ పోస్టర్ సహా కొన్ని బయటకి రాగా ఇది మాత్రం మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :