మిస్టర్ బాక్సాఫీస్ తో నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా సినిమా.!

Published on Dec 15, 2021 8:00 am IST

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో సాలిడ్ గా ఇంపాక్ట్ కనబరుస్తున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్. లేటెస్ట్ “రౌద్రం రణం రుధిరం” ట్రైలర్ తర్వాత చరణ్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మరోసారి మారు మొగుతుంది. అయితే అందరూ స్టార్ హీరోలు తమ లైనప్స్ తో బిజీగా ఉన్నారు అనే టైం కి చరణ్ ఏ కొత్త దర్శకునితో కూడా సినిమా అనౌన్స్ చెయ్యలేదు.

అలా చాలా కాలం తర్వాత ఊహించని విధంగా ఐకానిక్ దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా పాన్ ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక ఈ కాంబో తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా అనౌన్స్ చెయ్యడంతో తన లైనప్ పై మరింత క్రేజ్ తో పాటు ఆసక్తి కూడా పెరిగింది. మరి ఇప్పుడు గౌతమ్ సినిమాపైనే ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై మాట్లాడుతూ రామ్ చరణ్ తో చేయబోయే తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియన్ సినిమానే అని ఇంకా చెప్పాలంటే అది పాన్ ఇండియన్ సినిమాకి మించి ఉండబోతుంది అని తెలిపాడు. అలాగే ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని కూడా రివీల్ చేసాడు. ఇంకా కాస్ట్ అయితే సినిమాకి ఫైనల్ కాలేదు అని తెలిపి ఈ సినిమా పై ఓ క్రేజీ అప్డేట్ ని అందించారు. ఇక దీనిని బట్టి వీరిద్దరి కాంబో లో సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :