సంక్రాంతి బరిలో మిస్టర్ మజ్ను !

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ నిన్న విడుదలయ్యాయి. ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అక్కినేని అభిమానులను ఫిదా చేసింది. ‘తొలిప్రేమ’ ఫెమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈచిత్రం సంక్రాంతికి విడుదలకానుందని సమాచారం. ఇక ఇప్పటికే సంక్రాంతి కి ‘ఎన్టీఆర్, ఎఫ్2 , ఆర్ సి 12’ చిత్రాలు విడుదలకు స్లాట్ ను బుక్ చేసుకున్నాయి. దాంతో ఇప్పడు ఈ మిస్టర్ మజ్ను కూడా బాక్సాఫిస్ వద్ద ఈ చిత్రాలతో పోటీపడనుంది. మరి ఈ స్టార్ హీరోలకు అఖిల్ ఏ రేంజ్ లో పోటీ ఇస్తాడో చూడాలి.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Exit mobile version