లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక పవర్ ఫుల్ యాంథమ్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ రాప్ సింగర్ బాబా సెహగల్ తనదైన ఎనర్జీతో ఆలపించిన ఈ పాటలో.. శ్రీకృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లు చూపించడం విశేషం.
వ్యవసాయ గొప్పతనాన్ని చాటిచెప్తూ, మట్టి వాసనకు ఆధునికతను జోడిస్తూ నిర్మాత అరవింద్ మండెం స్వయంగా ఈ పాటకు సాహిత్యం అందించారు. ప్రకాష్ చెరుకూరి స్వరపరిచిన బాణీలు, బాబా సెహగల్ జోష్ పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చాయని మేకర్స్ తెలిపారు. అరవింద్ మండెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్.వి.ఎస్.ఎన్ బాబ్జీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Mr Work From Home Movie Anthem Song
