ఆ విషయంలో మొహమాట పడకూడదు – మృణాల్ ఠాకూర్

ఆ విషయంలో మొహమాట పడకూడదు – మృణాల్ ఠాకూర్

Published on Dec 18, 2022 7:55 PM IST

సీతారామం సినిమాలో క్యూట్ బ్యూటీగా మృణాల్ ఠాకూర్ మంచి పేరు తెచ్చుకుంది. అందమైన నటనతో తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక తెర పై ఎంతో కూల్ గా కనిపించే మృణాల్ ఠాకూర్.. తెర బయట అంత కూల్ కాదు. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో ఆమె ఎక్స్ పర్ట్. తాజాగా మృణాల్ ఠాకూర్
షాకింగ్ కామెంట్ చేసింది. అదీ కూడా హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ గురించి ఆమె కామెంట్స్ చేయడం విశేషం.

ఇంతకీ, మృణాల్ ఠాకూర్ ఏం మాట్లాడింది అంటే.. ఆమె మాటల్లోనే.. ‘హీరోయిన్స్ తమ రెమ్యూనరేషన్స్ విషయంలో అసలు మొహమాట పడకూడదు. ఎంతో నిక్కచ్చిగా ఉండాలి. కొందరు హీరోయిన్స్ తమ రెమ్యూనరేషన్ అడిగే విషయంలో అయోమయానికి గురవుతున్నారు. హీరోయిన్స్ ఆ పరిస్థితి నుండి బయటపడాలి. సినిమాకి రెమ్యూనరేషన్ నీవు ఎంత కావాలి అనుకుంటున్నావో స్పష్టంగా చెప్పాలి. అప్పుడే కెరీర్ పై నీ కాన్ఫిడెంన్స్ తెలుస్తుందని మృణాల్ ఠాకూర్
అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు