హీరో విక్ర‌మ్‌ని కలిసిన ధోనీ.. “మహాన్” కోసమేనా?

Published on Feb 3, 2022 2:00 am IST

ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌ను టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ సారధి మ‌హేంద్ర‌సింగ్ ధోని కలిశాడు. ఐపీఎల్‌ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్న ధోనీ ఉన్నపలంగా విక్ర‌మ్‌ని కలవడం ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఐపీఎల్ వర్గాలు వీరిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని చెబుతున్నారు.

కానీ విక్ర‌మ్ తాజాగా న‌టించిన చిత్రం “మ‌హాన్” ట్రైల‌ర్ విడుద‌ల రోజే ధోనీ కలవడం చిత్ర ప్రమోషన్‌లో భాగమేనని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విక్ర‌మ్ త‌న కొడుకు ధృవ్‌తో క‌లిసి న‌టించిన “మహాన్” ఫిబ్ర‌వ‌రి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.

సంబంధిత సమాచారం :