తెలుగులోనూ విడుదలకానున్న ‘ఎం. ఎస్. ధోనీ’ చిత్రం

ms-dhoni
‘ఎం.ఎస్. ధోనీ’.. ఓ సాధారణ టికెట్ కలెక్టర్ స్థాయి నుండి ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎదిగి కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రమే ‘ఎం. ఎస్. ధోనీ – ది అన్ టోల్డ్ స్టోరీ’. దర్శకుడు ‘నీరజ్ పాండే’ తెరకెక్కించిన సెప్టెంబర్ 30న విడుదలకానుంది. ట్రైలర్లు సూపర్ హిట్ కావడంతో తెలుగునాట కూడా ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది.

దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న హిందీతో పాటు తెలుగులో సైతం విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ తెలియజేసింది. అలాగే తెలుగు వెర్షన్ కు సంబందించిన ట్రైలర్ ను కూడా ఈరోజు సాయంత్రం విడుద చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తతో తమ ఫెవరెట్ ధోనీ సినిమాని హిందీలో చూడాల్సివస్తుందేమోనని కాస్త డిసప్పాయింట్ అయిన తెనుగు అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.