నవంబర్ 30 న మడ్డీ ట్రైలర్ విడుదల…తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు!

Published on Nov 28, 2021 6:12 pm IST

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం అయిన మడ్డీ డిసెంబర్ 10న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీషుతో సహా 6 భాషల్లో విడుదల కి సిద్దం అవుతోంది. దర్శకుడు డా. ప్రగాభల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, PK 7 బ్యానర్‌పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకోవడంతో మడ్డీ చిత్రం కి తెలుగులో పెద్ద మద్దతు లభించింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 30 సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా విడుదల అయిన పోస్టర్ తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :