ప్రైమ్ వీడియో లో ట్రెండ్ అవుతున్న “ముగ్గురు మొనగాళ్ళు”

ప్రైమ్ వీడియో లో ట్రెండ్ అవుతున్న “ముగ్గురు మొనగాళ్ళు”

Published on Oct 13, 2021 1:11 AM IST


శ్రీ‌నివాస్‌రెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ముగ్గురు మొనగాళ్లు. ఫస్ట్ లుక్, ట్రైల‌ర్‌ లతోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుద‌ల‌ అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. అంగవైకల్యం కలిగిన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? ఆ కేసు నుండి ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి విన‌ప‌డ‌దు, దీక్షిత్‌ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ఈ ముగ్గురు నటులు కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. వీరి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులను క‌డుపు చ‌క్క‌లయ్యేలా న‌వ్వించారు.

ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ అంశాలు ఉన్నాయి. గ‌రుడ‌ వేగ ఫేమ్ అంజి అందించిన విజువ‌ల్స్‌, సురేష్ బోబ్బిలి సంగీతం, చిన్న నేపథ్య సంగీతం వంటివి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియో లో మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే మంచి వ్యూయర్ షిప్ కూడా నమోదవుతుండడం హర్షించదగ్గ విషయం. ఈ ముగ్గురు మొనగాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్లో దూసుకుపోతుండడం మరో విశేషం. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిత్రమందిర్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై అచ్యుత్‌ రామారావు నిర్మించారు.

ఈ చిత్రం లో శ్రీనివాసరెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటించగా, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్‌ రవి, భ‌ద్రం, సూర్య, జబర్తస్త్‌ సన్నీ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు