బాలయ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్.!

Published on Sep 5, 2021 4:25 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం అనంతరం బాలయ్య లైనప్ మరింత సాలిడ్ గా కూడా ఉంది. అయితే వీటిలో ఆల్రెడీ మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒకటి ప్లాన్ చెయ్యగా వరుస విజయ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడితో కూడా ఒకటి ఉంది.

అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక అనౌన్సమెంట్ ఎప్పుడు అన్నది ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. రానున్న అక్టోబర్ నెల దసరా కానుకగా ఈ సాలిడ్ కాంబో అధికారింకంగా అనౌన్స్ చేస్తున్నట్టుగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం కూడా నందమూరు అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే దసరా పండుగ వరకు వారు ఆగాల్సిందే మరి.

సంబంధిత సమాచారం :