చిరు మాసివ్ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు.?

Published on Oct 22, 2021 12:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో చేసిన బిగ్ బడ్జెట్ మల్టీ స్టారర్ “ఆచార్య” అయితే ఆల్రెడీ షూట్ అయ్యిపోయి రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు భోళా శంకర్, గాడ్ ఫాథర్ చిత్రాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ వీటి తర్వాత మరో సిసలైన దర్శకుడు కే ఎస్ రవీంద్ర(బాబీ) తో చేయనున్నారు.

దీనిపైనే రీసెంట్ గా ఓ మాస్ బజ్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే నవంబర్ 6 న ఈ సినిమా ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఆరోజు ఈ సినిమా ఫార్మల్ ముహుర్తాన్ని జరుపుకోనుందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More