ప్రభాస్ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ కి ముహూర్తం అప్పటికి.?

Published on Sep 12, 2021 3:00 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన లైనప్ ని ఒక రేంజ్ లో సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి ఒకదానిని మించి మరొకటి సెట్ చేస్తూ వెళుతున్న ప్రభాస్ ఇప్పుడు రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా ప్రభాస్ తన కెరీర్ లో బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ అయినటువంటి 25వ సినిమాపై ఇటీవలే సినీ వర్గాల్లో బజ్ స్టార్ట్ అయ్యింది.

మరి ఇక్కడ నుంచి ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వెళ్తుందో అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు ఓ ఆసక్తికర న్యూస్ తెలుస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ ఆల్రెడీ “బృందావన” అనే ప్లెజెంట్ టైటిల్ ని ఫిక్స్ చేసారని వినిపించింది. మరి ఇది కన్ఫర్మ్ అన్నట్టే నయా టాక్ అంతే కాకుండా ఈ సినిమా అధికారికంగా ఎప్పుడు ప్రకటన అవుతుంది అన్న దానిపై కూడా బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

తాజా టాక్ ప్రకారం ఈ బిగ్ ప్రాజెక్ట్ వచ్చే డిసెంబర్ నెల రెండు లేదా మూడో వారంలో అనౌన్స్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు అని సమాచారం. మరి ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ సినిమాగా దిల్ రాజు తీస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :