మెగాస్టార్ “భోళా శంకర్” కి ముహూర్తం ఫిక్స్.!

Published on Oct 27, 2021 9:57 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు రెండు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి దర్శకుడు మోహన్ రాజా తో తెరకెక్కిస్తున్న చిత్రం “గాడ్ ఫాథర్” ఒకటి కాగా ఇంకొకటి దర్శకుడు మెహర్ రమేష్ తో తెరకెక్కనున్న చిత్రం “భోళా శంకర్”. రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలు అని తెలిసిందే. ఆల్రెడీ గాడ్ ఫాథర్ షూట్ కంటిన్యూ అవుతుండగా ఇప్పుడు భోళా శంకర్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని ఇచ్చారు.

ఈ చిత్రానికి వచ్చే నవంబర్ 11 న ముహూర్తం ఫిక్స్ చెయ్యగా రెగ్యులర్ షూట్ ని ఆ నవంబర్ 15 నుంచి మొదలు పెట్టనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ వేదాళం కి రీమేక్ గా తెరక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ ఎలా కనిపించనున్నారు అనేదే చాలా ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More