ముక్కు అవినాష్ ‘జత కలిసే’ వీడియో వైపు ఓ లుక్కేయండి..!

Published on Sep 7, 2021 3:00 am IST


బుల్లితెర నటుడు, బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇటీవల అవినాష్‌కి, అనూజ అనే అమ్మాయికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి పెళ్లి అంటూ కలవరిస్తూ వస్తున్న అవినాష్ ఎట్టకేలకు వివాహం చేసుకుంటుండడంతో అందరూ ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. అయితే సింపుల్‌గా జరిగిన నిశ్చితార్ధానికి సంబంధించి అవినాష్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు.

‘జత కలిసే’ అంటూ ఉన్న తన నిశ్చితార్ధం వీడియోను అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. ఇరు కుటుంబాలు పూలు పళ్లు మార్చుకోవడం, అవినాష్, అనూజలు పూలదండలు, రింగ్స్ మార్చుకోవడం, ఒకరికొకరు తినిపించుకోవడం, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలు ఉన్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుండడంతో సోషల్ మీడియాలో ఈ ‘జత కలిసే’ వీడియో వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం అవినాష్ నిశ్చితార్ధం ఎలా జరిగిందో మీరు చూసేయండి.

సంబంధిత సమాచారం :