స్విట్జర్లాండ్ లో ‘ముకుంద’ పాటల చిత్రీకరణ.

varun-tej
ఒకవైపు మంచు కొండలు, అందమైన లొకేషన్స్ .. మరోవైపు సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్ స్వరపరిచిన బ్యూటిఫుల్ మెలోడీ. తన తొలి చిత్రంలో పాటలను వెండితెరపై అందంగా ఆవిష్కరించడానికి కష్టపడుతున్నాడు మెగా వారసుడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ సరసన పూజ హెడ్గే నటిస్తున్న సినిమా ‘ముకుంద’. ప్రస్తుతం ఈ సినిమాలో పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. స్విట్జర్లాండ్ లో సాంగ్స్ షూటింగ్ చేయడం గొప్ప అనుభవం అని వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలిపారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version