మల్టీజానర్ మూవీగా ‘మాటరాని మౌనమిది’ ఆకట్టుకుంటుంది – దర్శకుడు సుకు పూర్వాజ్

మల్టీజానర్ మూవీగా ‘మాటరాని మౌనమిది’ ఆకట్టుకుంటుంది – దర్శకుడు సుకు పూర్వాజ్

Published on Aug 16, 2022 1:52 PM IST

రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ బ్యానర్స్ పై మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మాటరాని మౌనమిది. తొలిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ శుక్ర తెరకెక్కించి అందరి నుండి మంచి పేరు అందుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. లవ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న మాటరాని మౌనమిది ఈనెల 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

నా ఫస్ట్ మూవీ శుక్ర షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే దాని మేకింగ్ చూసి ఈ ప్రాజక్ట్ నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. ఆ తరువాత పూర్తి కథ, కథనాలు సిద్ధం చేసి ఫైనల్ గా షూటింగ్ కి రెడీ అయ్యాం. అయితే శుక్ర రిలీజ్ తరువాత అందరి నుండి మంచి ఆదరణ అందుకోవడం మాకు మరింత బలాన్నిచ్చింది. అందుకే మాటరాని మౌనమిది మూవీ పై మరింతగా శ్రమపడి తీసాము. నిజానికి ఏదైనా మూవీలో ఫిక్షన్, థ్రిల్లర్, హర్రర్ అనే ఏదో జానర్ లో సాగుతుంటాయి. కానీ మా మూవీ మాత్రం అవి కలిపి మల్టిజానర్ మూవీగా చేసాము. ఇందులో రెండు హాంటెడ్ లవ్ స్టోరీస్ ఉంటాయి,

మంచి ఫన్ అంశాలు కూడా మూవీ లో ఉంటాయి. ఇటీవల మూవీ పూర్తి అయ్యాక కొందరికి ప్రివ్యూస్ వేసాము అందరూ మెచ్చుకోవడంతో మూవీ పై నమ్మకం కలిగింది. గతంలో నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ న్యూయార్క్, బాంబే ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అయ్యాయి. నిజానికి ఒక జానర్ లో సాగె మూవీస్ ని అన్ని విధాలుగా ప్రేక్షకులని మెప్పించడం కష్టం. అదే ఇందులో అయితే మల్టిపుల్ జానర్స్ ఉండడంతో ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. ఈ మూవీ కొత్త హీరో, హీరోయిన్స్ తో చేస్తున్నాం కాబట్టి వారితో కాకుండా దర్శకుడు రవిబాబు స్ఫూర్తిగా ఆయన మాదిరిగా డిఫరెంట్ గా పోస్టర్స్ డిజైన్ చేయించాము.

ఫస్ట్ ఈ మూవీని మూకీల్లో చేద్దాం అని భావించాము, అయితే ఆ తరువాత మాటలు ఉంటె బాగుంటుందనిపినించింది. సినిమాలో రెండు మేజర్ క్యారెక్టర్స్ కి మాటలు ఉండవు, అయితే అనుకోని పరిస్థితి ఎదురైతే వారు ఏ విధంగా దానిని వారు కన్వే చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకి మహిళలు అంటే దేవతలు, భరతమాత వంటి వారు గుర్తుకు వస్తారు. వాళ్లంటే మనకి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర 1986 నుండి ప్రస్తుతం వరకు సాగుతుంది, గతంలో ఆమెకు మాటలు ఉండవు, ప్రస్తుతం మాటలు వస్తాయి. ఒక శాస్త్రీయ అంశంతో ముడిపడి సాగె అసతికరమైన కథనం ద్వారా మూవీ సాగుతుంది. నాయిక పాత్రలో సోని శ్రీవాస్తవ ఎంతో బాగా నటించింది. అలానే హీరో మహేష్ అన్నపూర్ణ ఫిలిం స్టూడియోస్ లో శిక్షణ తీసుకున్నాడు. అలానే వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. సుమన్ శెట్టి, అర్చనా అనంత్ ఈ మూవీలో ఇతర పాత్రల్లోనటించారు.

మల్టిజానర్ ఫిలిం కావడంతో దీనికి నేపధ్య సంగీతం ఎక్కువ అవసరం. అందుకే నా ఫస్ట్ మూవీ శుక్ర కి పని చేసిన అషీర్ లూక్, ఆశీర్వాద్ లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా తీసుకున్నాం. గతంలో ఓం శాంతి ఓం, బాహుబలి, జాంబిరెడ్డి మూవీస్ కి వీరిద్దరూ వర్క్ చేసారు. అయితే టైటిల్స్ లో వీరికి క్రెడిట్స్ ఉండవు. నేపధ్య సంగీతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మన మూవీస్ లో ఎక్కువగా లవ్ స్టోరీస్ వస్తున్నప్పటికీ వాటిలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడో ఒకచోట ఉంటాయి. మల్టిజానర్ మూవీ కావడంతో ఇందులో కూడా అంటువంటి అంశాలు ఉన్నాయి. ఇక త్వరలో మాఫియా, యాక్షన్ ఫిలిమ్స్ చేయాలనీ అనుకుంటున్నాను, అన్ని కుదిరితే త్వరలో పూర్తి విషయాలు మీకు వెల్లడిస్తాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు