ఆర్యన్ ఖాన్ కి ముంబై ప్రత్యేక కోర్ట్ బెయిల్ నిరాకరణ!

Published on Oct 20, 2021 8:26 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ కి ముంబై లోని ప్రత్యేక కోర్ట్ బెయిల్ ను నిరాకరించడం జరిగింది. ఆర్యన్ తో పాటుగా అతని స్నేహితుడు అయిన అర్భాజ్ మర్చంట్ మరియు మోడల్ మున్మున్ ధమెచా కూడా నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకొట్రోపిక్ సబ్ స్టాన్స్ చట్టానికి సంబంధించిన పలు కేసులను విచారించడానికి నియమించబడిన జడ్జ్ వివి పాటిల్ బెయిల్ నిరాకరించడం జరిగింది.

ఆర్యన్ తో పాటుగా ఇతర నిందితుల పై ఎన్డిపిఎస్ చట్టం సెక్షన్ 8సి, 20బీ, 27, 28, 29 మరియు 35 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆర్యన్ మరియు అర్భాజ్ ఆర్థర్ జైల్లో ఉండగా, మున్నున్ ముంబై లోని బైకుల్లా మహిళా జైలు లో అన్నారు. క్రూయిజ్ షిప్ పై దాడి చేసిన అనంతరం అక్టోబర్ 3 వ తేదీన నిందితులను ఎన్ సి బి అరెస్ట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More