మున్నాభాయ్ 3 కూడా కంఫర్మ్ అయ్యింది !

Munna

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాజు కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ నటించిన ‘మున్నాభాయ్ ఏం బి బి ఎస్’ , ‘మున్నాభాయ్ లగేరహో’ చిత్రాలు ఘన విజయాన్ని సాదించాయి. ఇక ఈచిత్రాలు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో రీమేక్ చేశారు. ‘శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్ , శంకర్ దాదా జిందాబాద్’ అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రాల్లో ‘శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్’ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది.

ఇక ఇప్పుడు ఈ సిరీస్ నుండి మున్నాభాయ్ 3 కూడా రానుంది. మొదటి రెండు చిత్రాల్లో కీలక పాత్రలో నటించిన అర్షద్ వర్సి ఈ విషయాన్ని ద్రువికరంచారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఈ ఏడాది చివర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని ఆయన అన్నారు. మరి ఈ చిత్రం తెలుగులో కూడా రీమేక్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version