గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “గేమ్ ఛేంజర్” లేటెస్ట్ గానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ యంగ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో తన కెరీర్ 16వ సినిమాని చేస్తున్నాడు. ఇపుడు షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండగా మేకర్స్ హైదరాబాద్ లో సినిమా సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఫేమస్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మ కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి అనౌన్సమెంట్ తోనే సాలిడ్ రెస్పాన్స్ ని తాను అందుకోగా లేటెస్ట్ గా తాను సినిమా సెట్స్ లో అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ తో కూడిన సీన్స్ లోనే పాల్గొన్నట్టుగా టాక్. అయితే ఈ సినిమాలో మున్నాభాయ్యా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మరి చూడాలి ఈ క్రేజీ కలయికలో సినిమా ఎలా ఉంటుందో అనేది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.