“సర్కారు వారి పాట” నుండి రేపు మురారి వా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!

Published on Jun 6, 2022 8:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాల తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం జరిగింది. కీర్తి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ధియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో లేట్ గా యాడ్ చేసిన మురారి వా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

రేపు ఉదయం 11:07 గంటలకు మురారి వా సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని, తనికెళ్ళ భరణి, నాగబాబు తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :