సర్కార్ వివాదంపై ఎమోషనల్ గా స్పందించిన మురుగదాస్ !

ఇళయదళపతి విజయ్ నటించిన 62వ చిత్రం ‘సర్కార్’ విడుదలకు ముందు కొత్త చిక్కుల్లో పడింది. ఈ చిత్ర కథ నాదేనంటూ రచయిత వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు. వరుణ్ ఈ కథను 2007 లోనే రాసుకున్నాడు దానికి ‘సెంగోల్’ అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఇటీవల వరుణ్ రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్ దృషి కి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

సెంగోల్ మరియు సర్కార్ కథలు రెండు ఒకేలా ఉన్నాయని వరుణ్ ను కోర్టు వెళ్లకుండా ఆపలేమని భాగ్యరాజ్ చెప్పడంతో దీనిపై సర్కార్ దర్శకుడు మురుగదాస్ ఎమోషనల్ గా స్పందించారు. భాగ్యరాజ్ వరుణ్ తరుపున వాదనను విని ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఇక వరుణ్ కథకు నా కథకు వున్నా పోలిక ఒక్కటే ఓట్ల ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే కోణంలో ఉంటుంది అంతే తప్ప వరుణ్ రాసుకున్న కథలో కీలక అంశాలు లేవు.

జయలలిత గురించి కూడా మా కథలో ప్రస్తావించాం. 2007లో నే వరుణ్ రాసుకున్న కథలో జయలలిత మరణం గురించి ఎలా ఉంటుంది? ఈ వార్తలు నన్ను చాల బాధించాయి నా గుండె పగిలినంత పనైయ్యింది అని అన్నారు.

Exit mobile version