హాలీవుడ్ సినిమాను రీమేక్ చెయ్యనున్న టాప్ డైరెక్టర్ !
Published on Dec 4, 2017 7:26 pm IST

దక్షిణాది స్టార్ దర్శకుల్లో ఒకరైన మురగదాస్ తరువాతి సినిమాకు సంబందించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ డైరెక్టర్ త్వ‌ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో హాలీవుడ్ మూవీ ‘మిలియ‌న్ డాల‌ర్ బేబి’ ని హిందీలో రీమేక్ చెయ్యబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రదాన పాత్ర కోసం సీరియల్ నటి మారినా కౌర్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం 2018లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. అక్షయ్ కుమార్ సరసన మరీనా కౌర్ నటించబోతుండడంతో ఆమె తన సంతోషాన్ని పలువురితో పంచుకుందట. ప్రస్తుతం అక్షయ్ ‘2.0’ లో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో వైవిధ్యంగా కనిపించబోతున్నాడు ఈ హీరో. ఇకపోతే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook