వేగవంతమైన బాలయ్య 102 వ సినిమా పనులు !
Published on Jul 15, 2017 12:16 pm IST


బాలకృష్ణ కొత్త చిత్ర పనులు వేగవంత మయ్యాయి. తమిళ సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో ఆగష్టు 10 నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో నయనతార హిరోయిన్ గా ఎంపికైంది.

ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగవంతం అయింది. కంచె ఫేమ్ చిరంతన్ బట్ ఈచిత్రానికి సంగీత దర్శకుడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రాయలసీమ రాజకీయ మరియు ఫ్యాక్షన్ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. రూలర్, జయ సింహ మరియు రెడ్డిగారు వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook