పవన్ “అంత ఇష్టం” సాంగ్ పై థమన్ ఏమన్నారంటే?

Published on Oct 6, 2021 3:00 pm IST

పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రానా దగ్గుపాటి మరొక హీరో గా ఈ చిత్రం లో నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంత ఇష్టం అంటూ ఈ పాట కొనసాగనుంది. ఈ పాట ఎలా ఉండనుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం కి సంగీత అందిస్తున్న థమన్ కి ఒక అభిమాని సాంగ్ ఎలా ఉంటుంది అని ప్రశ్న వేయగా థమన్ స్పందించారు. పాట లక్షల మాటలు మాట్లాడుతుంది అంటూ చెప్పుకొచ్చారు. పాట టైటిల్ ను, భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ మరియు భీమ్లా నాయక్ టైటిల్ ను ట్యాగ్ చేశారు థమన్. ఈ చిత్రం కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :