ప్రభాస్, ఎన్టీఆర్ లతో అది మ్యాజికల్ ఫన్ – థమన్

Published on Jan 21, 2022 11:22 pm IST


సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఒక పోస్ట్ పై రెస్పాండ్ అయ్యారు. బృందావనం ఆడియో రిలీజ్ వేడుక లో ఎన్టీఆర్ మరియు ప్రభాస్ లు కలిసి పక్క పక్కనే ఉన్న వీడియో అది. బృందావనం చిత్రానికి థమన్ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. థమన్ అన్న మాస్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ షేర్ చేయడం జరిగింది.

ఆ పాటకి గానూ, ఇది బంగారం అంటూ చెప్పుకొచ్చారు. తారక్ అన్న, ప్రభాస్ అన్న లతో మ్యాజికల్ ఫన్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. థమన్ ప్రస్తుతం వరుస సినిమాలకి సంగీతం అందిస్తూ బిజిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :