సర్కారు వారి పాట: ఆ పాటకి థియేటర్ల లో రచ్చ ఖాయం అంటున్న థమన్

Published on Apr 27, 2022 2:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన పెన్నీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట వచ్చేప్పుడు థియేటర్ల లో రచ్చ ఖాయం అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం కోసం పని చేస్తున్న థమన్, మరిన్ని అప్డేట్ లని త్వరలో ఇవ్వనున్నారు. మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :