నా స్నేహితుడు కోలుకుంటున్నాడు – థమన్

Published on Sep 14, 2021 1:44 pm IST


సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై సంగీత దర్శకులు థమన్ మరొకసారి సోషల్ మీడియా లో స్పందించారు. సాయి ధరమ్ తేజ్ ను నంబన్ అంటూ సంబోధిస్తూ త్వరగా కోలుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తనకు గట్టి పట్టుదల ఉంది అంటూ చెప్పుకొచ్చారు. సంగీత దర్శకులు థమన్ ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ, ఒక ఫోటో ను షేర్ చేశారు. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం బైక్ ఆక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియడం తో అభిమానులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :