ఫుల్ స్వింగ్ లో మెగాస్టార్ “గాడ్ ఫాదర్” మ్యూజిక్ సెషన్స్!

Published on Oct 3, 2021 10:42 pm IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన పుట్టిన రోజున ప్రకటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పటికే షూటింగ్ మొదలై, ఫుల్ స్వింగ్ లో దూసుకు పోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ బయటికి రావడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ చిత్రానికి రీమేక్ వస్తున్న ఈ గాడ్ ఫాదర్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంగీతం థమన్ అందిస్తున్నారు. జయం మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నిరవ్ షా అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :