“బంగార్రాజు” నుండి మ్యూజికల్ పోస్టర్ విడుదల!

Published on Dec 14, 2021 1:15 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కృతి శెట్టి, రమ్య కృష్ణ లేడీ లీడ్ రోల్స్ లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరొకసారి ఈ చిత్రం లో నాగార్జున మరియు నాగ చైతన్య లు కలిసి నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం నుండి ది పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ పేరిట ఒక పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన మ్యూజికల్ పోస్టర్ ను విడుదల చేస్తూ,ఈ పాటకి సంబందించిన టీజర్ డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఆడి పాడనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :