“రాధే శ్యామ్” బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీ హృదయాల్లో నిలిచిపోతుంది – థమన్

Published on Mar 9, 2022 1:00 am IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూ వీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను ఈ నెల 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా రాధే శ్యామ్ కి బ్యాగ్రౌండ్ కోసం పని చేస్తున్న ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు థమన్. ఇది మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది అని, మీ హృదయాల్లో నిలిచి పోతుంది అంటూ చెప్పుకొచ్చారు. థమన్ తో పాటుగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సైతం వీడియో లో కనిపిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :