నెక్స్ట్ సినిమాలో నా పాత్ర భిన్నంగా ఉంటుంది – నాగచైతన్య


‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య రేపు విడుదలకాబోతున్న ‘యుద్ధం శరణం’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే తన నెక్స్ట్ సినిమాగా చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమాలో నటించబోతున్నాడు చైతు. ఈ సినిమాలో తానొక డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నానని తెలిపారు. ‘సవ్యసాచి’ అనే టైటిల్ గురించి వివరిస్తూ ‘ఈ సినిమాలో తన కుడి చేతికి ఎంత నైపుణ్యం ఉంటుందో ఎడమ చేతికి కూడా అంతే నైపుణ్యం ఉంటుంది, అందుకే సినిమాకు ‘సవ్యసాచి’ అనే పేరు పెట్టాం’ అన్నారు

పాత్ర పరంగా తన లెఫ్ట్ హ్యాండ్ తన బ్రెయిన్ కంట్రోల్ లో ఉండదని, తన కంట్రోల్ లో లేకుండా ఎడమ చేయి పని చేస్తుంటుందని తెలిపాడు. మన శరీరంలో ఒక అవయం మన అధినంలో లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమాలో చూపిస్తారట. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ను తన తాతగారు అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ఈ నెల 20 నుండి మొదలుపెడతామని చెప్పాడు చైతు.