మామయ్య ఫొటోతోనే నా రోజు ప్రారంభం అవుతుంది – తేజ్

sai dharam tej3
మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘తేజ్‌ ఐ లవ్‌ యు’. ఈ చిత్ర ఆడియోని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. తేజ్ ఆడియో వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక మెగాస్టార్ గురించి చెప్తూ ‘ప్రత్యేక అతిథిగా వచ్చిన మామయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని’ అభిమానులతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘నేను ప్రతిరోజూ ఉదయం లేవగానే ముందు చూసేది, ఎదురుగా నవ్వుతూ ఉన్న మామయ్య ఫొటోనే. ఆ ఫొటో చూసిన తర్వాతే నాకు ఆ రోజు మొదలు అవుతుంది’ అని అన్నారు.

ఇక ఈ చిత్రంలో ‘సాయిధరమ్‌ తేజ్‌’ సరసన ‘అనుపమ పరమేశ్వరన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమ కథల దర్శకుడు ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు, వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Exit mobile version