‘స్పైడర్’ తో తన కల నెరవేరిందంటున్న మహేష్ !

25th, September 2017 - 04:57:11 PM


సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి టాప్ దర్శకులు సైతం పోటీపడుతుండగా మహేష్ మాత్రం మురుగదాస్ తో సినిమా చేయడంతో తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 27న చిత్ర రిలీజ్ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఎన్నో ఏళ్లుగా మురుగదాస్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. దాదాపు 10 ఏళ్లకు కుదిరింది’.

‘అసలు స్పైడర్ సినిమా చేయడానికి మొదటి ఇన్స్పిరేషన్ మురుగదాస్ గారే. అలాంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమాతో తమిళంలో కూడా లాంచ్ అవుతున్నాను. ఒక సినిమాని ఒకే సమయంలో ఏను భాషల్లో తీయడం జోక్ కాదు. అది మురుగదాస్ లాంటి గొప్ప దర్శకుడికే సాధ్యమవుతుంది’ అన్నారు. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించగా సంతోష్ శివన్ సినిమాయోగ్రఫీ చేశారు.