వైరల్ వీడియో : నా ఆనందం అందులోనే ఉంటుంది – అల్లు స్నేహారెడ్డి

Published on Feb 25, 2023 2:13 am IST

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ అయిన పుష్ప 2 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తోపాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా తరచు తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ తో తమ ఫ్యామిలీ విషయాలను తరచు షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇక లేటెస్ట్ గా తమ ఇంటి గార్డెన్ లో నడుస్తూ ఆమె ఒక వీడియో పోస్ట్ చేసారు. మన జీవితంలో నిజమైన ఆనందం అంటే మన చుట్టూ మొక్కలు ఉండడమేనని, అలానే వాటిని ఎంతో ఇష్టంతో జాగ్రత్తగా పెంచుకోవడం, చూసుకోవడం తనకు ఆనందం అని ఆమె తెలిపారు. అందుకే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో నర్సరీ ఒకటని ఆమె పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :