తన అంతిమ లక్ష్యం అదేనన్న మారుతి !


మహానుభావుడు చిత్రం విజయం సాధించడంతో దర్శకుడు మారుతి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ప్రతి ఫ్యామిలీ ఈ చిత్రాన్ని చూడాలనుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చే అంశమని మారుతి తెలిపారు. మారుతి కథలని రాసుకునే విధానం గురించి వివరించారు. హీరోని అతడి ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకునే తాను కథలు రాసుకుంటానని మారుతి ఇంటర్వ్యూ లో తెలిపారు.

దర్శకుడిగా తన అంతిమ లక్ష్యం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే చిత్రాలు చేయడమే అని మారుతి అన్నారు. అందరు స్టార్ లతో పనిచేయాలన్న తన కోరికని కూడా మారుతి బయట పెట్టారు. ఓ సన్నివేశాన్ని లేదా చిత్రాన్ని చూడగానే ఇది అసలైన మారుతి చిత్రం అనేలా తన మార్క్ ని క్రియేట్ చేయాలని తెలిపారు. కాగా మారుతి తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉండబోతోంది.