టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం వరుసగా పలు అవకాశాలతో నటుడిగా కొనసాగుతున్నారు. రంగస్థలం, అరవిందసమేత, లెజెండ్, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో ఆయన పోషించిన నెగటివ్ క్యారెక్టర్స్ కి అందరి నుండి మంచి పేరు లభించింది. ఆయా పాత్రల్లో సహజత్వ నటన కనబరిచిన జగపతి బాబు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ల సలార్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ చేస్తున్నారు జగపతి బాబు.
తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా జగపతి బాబు మాట్లాడుతూ, తన కెరీర్ లోని బెస్ట్ క్యారెక్టర్స్ లో సలార్ లోని రాజమన్నార్ రోల్ ఒకటని అన్నారు. ఆ రోల్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా రాసుకున్నారని, అలానే అది రేపు స్క్రీన్ పై ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని నటుడిగా తనకు మరింత మంచి పేరు తెస్తుందని నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు. రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని విభిన్నమైన రోల్స్ తో ఆడియన్స్ ని మరింతగా అలరించాలనేది తన కోరిక అని అన్నారు జగపతి బాబు.