లియో: లోకేష్ తో పని చేయడం సంతోషం గా ఉంది – మిస్కిన్

Published on Feb 27, 2023 12:30 pm IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకు పోతున్నాడు. అదే రేంజ్ లో తన తదుపరి చిత్రాలను కూడా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో లియో అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల షురూ కాగా, శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్.

ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్న మిస్కిన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. లియో చిత్రం లో తన పాత్రకి సంబందించిన షూటింగ్ పూర్తి అయ్యింది అని అన్నారు. దాదాపు 500 మందికి పైగా మైనస్ 12 డిగ్రీస్ లో సినిమాకోసం కష్టపడుతున్నారు అని తెలిపారు. లోకేష్ తో కలిసి పనిచేయడం సంతోషం గా ఉంది అని అన్నారు. తన కృతజ్ఞత ను లోకేష్ నుదిటి పై ముద్దు పెట్టి వెల్లడించినట్లు తెలిపారు. ఈ చిత్రం లో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 19 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :