సల్మాన్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

Published on Sep 26, 2023 9:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు లీడింగ్ నిర్మాణ సంస్థల్లో భారీ హిట్స్ తో మంచి సక్సెస్ రేట్ ని నమోదు చేసిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. మరి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా భారీ చిత్రాలని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ నిర్మాతలు ఒకొక్కటిగా అడుగులు వేస్తూ వెళ్తున్నారు.

ఆల్రెడీ మళయాళ సినిమాలో ఓ డెబ్యూ సినిమాని తాము స్టార్ట్ చేయగా ఎప్పటి నుంచో బాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్లాన్ గీసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి అయితే తమ మొదటి కొలాబరేషన్ సినిమా రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా తన ప్రొడక్షన్ బ్యానర్ తో మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా చేసిన తాజా చిత్రం “ఫెర్రీ” తో అయితే ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. మరి ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా టీజర్ కూడా బయటకి వచ్చింది.

అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి మైత్రి మూవీ మేకర్స్ వేసిన ఈ అడుగు బాలీవుడ్ లో కూడా సూపర్ సక్సెస్ లతో దూసుకెళ్ళాలి అని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :