ఎన్టీఆర్ బైక్ అమ్మగా వచ్చిన డబ్బులు బాలకృష్ణ చేతికి !


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనక్కర్లదు. మంచి వసూళ్లతో పాటు పలు అవార్డులను కూడా ఈ చిత్రం కైవసం చేసుకుంది. సోషల్ మెసేజ్ ఉన్న కథతో రూపొందిన ఈ చిత్రం సోషల్ సర్వీస్ లో కూడా ముందుంది. ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతుండగా జనతా టీమ్ ప్రేక్షకులకు కాంటెస్ట్ పెట్టి అందులో గెలిచిన వారికి సినిమాలో ఎన్టీఆర్ వాడిన ప్రత్యేకంగా తయారుచేయబడిన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ బైక్ బహుమతిగా అందిస్తామని ప్రకటించారు.

దాంతో చాలా మంది ప్రేక్షలు పోటీలో పాల్గొన్నారు. చెప్పిన ప్రకారమే ఎన్టీఆర్ తన బైక్ ను కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన నల్గొండకు చెందిన రాజ్ కుమార్ రెడ్డికి బహుకరించారు. ఈ కాంటెస్ట్ ద్వారా సుమారు రూ. 10 లక్షల పొగయ్యాయి. ఈ మొత్తాన్ని దర్శకుడు కొరటాల శివ, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఆ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇస్తూ చెక్ ను హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ చేతికి అందించారు.