సవ్యసాచి ఓకే మరి అమర్ అక్బర్ .. ?

mythri movie

వరుస విజయాలతో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గా దూసుకుపోతుంది మైత్రి మూవీ మేకర్స్. ఈ సంస్థ నిర్మిస్తున్న రెండు చిత్రాలు ‘సవ్యసాచి అలాగే అమర్ అక్బర్ ఆంటొని’ షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతున్నాయి.

దాంట్లో నాగ చైతన్య నటించిన సవ్యసాచిఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఎట్టకేలకు నవంబర్ 2న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ విడుదల తేదీ ఫై కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఈ రోజు నిర్మాతలు ఈ చిత్రం యూఎస్ఏ ప్రీమియర్స్ నవంబర్ 1న అని కన్ఫర్మ్ చేయడంతో నవంబర్ 2న గ్రాండ్ గా విడుదలకావడం పక్క.

ఇక రవి తేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే ఈచిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Exit mobile version