వైరల్ పిక్ : ‘పఠాన్’ డైరెక్టర్ తో మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ .. ఎగ్జైటింగ్ న్యూస్ రానుందా ?

Published on Feb 1, 2023 10:30 pm IST


టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం పలువురు బడా హీరోల తో బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అలానే నటసింహం బాలకృష్ణ తో వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన ఈ సంస్థ యొక్క నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని నేడు ప్రముఖ యువ దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ ని కలిశారు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సిద్దార్ధ్ తెరకెక్కించిన పఠాన్ మూవీ ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ప్రస్తుతం మరింత గ్రాండ్ గా బాక్సాఫీస్ బద్దలుకొడుతూ దూసుకెళుతోంది.

అయితే ఆ మూవీ సక్సెస్ పై సిద్దార్ధ ఆనంద్ ని నిర్మాత నవీన్ అభినందించినట్లు తెలుస్తోంది. అలానే త్వరలో వారి సంస్థపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక భారీ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. కాగా ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ కూడా ఇందులో భాగం కానున్నట్లుగా కొద్దిరోజుల నుండి మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ బడా మూవీకి సంబదించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వీరిద్దరి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :