‘నా సామిరంగ’ : ముఖ్య పాత్రలో మరొక యంగ్ హీరో ?

Published on Sep 20, 2023 1:00 am IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితం కానున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. దీనిని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఈ మూవీతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మెగాఫోన్ పడుతున్నారు. ఈ క్రేజీ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనుండగా దీని ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.

అయితే ఈ మూవీలో నాగార్జున మాస్ పాత్ర చేస్తుండగా ఒక ముఖ్య పాత్రలో నటుడు అల్లరి నరేష్ నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక తాజా క్రేజీ బజ్ ప్రకారం యువ నటుడు రాజ్ తరుణ్ కూడా మరొక ముఖ్య పాత్ర చేయనున్నారట. అతి త్వరలో మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్న ఈమూవీ 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :