అదరగొట్టిన ‘నా సామిరంగ’ వినాయకచవితి స్పెషల్ పోస్టర్

Published on Sep 18, 2023 6:00 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నూతన దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ. ఇటీవల ది ఘోస్ట్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన నాగార్జున దానితో ఆశించిన స్థాయి సక్సెస్ సొంతం చేసుకోలేకపోయారు. దానితో నా సామిరంగ తో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకునేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు. ఇటీవల నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన నా సామిరంగ ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఇకపోతే నేడు వినాయక చవితి సందర్భంగా మూవీ నుండి నాగార్జున స్టైలిష్ లుక్ లో ఉన్న మంచి మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అదరగొట్టిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెజవాడ ప్రసన్న కుమార్ కథని అందిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా మూవీలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కాగా ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :