“చకోరి” సినిమా నుండి సిద్ శ్రీరామ్ పాడిన నా చెలివే సాంగ్ విడుదల

Published on Sep 13, 2021 10:03 am IST


నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్య ధానేకుల దర్శకత్వంలో దేవు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా చకోరి. ఈ చిత్రం నుంచి తాజాగా నా చెలివే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా, నోయల్ సీన్, మెహబూబ్ అందులో కనిపించారు. లీండర్ లీ మార్టీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్రన్ ఈ పాటకు సాహిత్యం అందించారు.

తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మాయ చేసారు సిద్ శ్రీరామ్. నా చెలివే అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రాంతి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న చకోరి సినిమాకు ప్రశాంత్ నీలం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

పాటను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :