“బంగార్రాజు” నుండి నాకోసం లిరికల్ టీజర్ విడుదల

Published on Dec 2, 2021 12:00 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తోంది. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సంక్రాంతి బరిలో బంగార్రాజు నిలవనుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి విడుదల ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నాకోసం అనే పాటకి సంబందించిన లిరికల్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడటం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి పాట డిసెంబర్ 5 వ తేదీన సాయంత్రం 5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ కలిసి నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :