జనవరిలో థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోన్న “నా పేరు శివ 2”

జనవరిలో థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోన్న “నా పేరు శివ 2”

Published on Jan 5, 2022 8:04 PM IST

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు శివ గా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని నిర్మించారు.

ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత జ్ఞానవేల్ రాజా అభిరుచి ని, ఆయన సినిమాల్లోని గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా. రంజిత్ నా పేరు శివ 2 సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే నా పేరు శివ 2 సినిమా థియేటర్ల లో రిలీజ్ కానుంది. కార్తి, క్యాథరీన్ థెరిసా, కలైయరాసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ మురళి. జి లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు