7 భాషల్లో విడుదలకానున్న ‘నా పేరు సూర్య’ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న ‘ నా పేరు సూర్య’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయో వేరే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ కూడా బాగుండటంతో అభిమానులంతా యాంగ్రీ సోల్జర్ గా బన్నీ ఎలా ఉంటాడో చూడాలని ఆరాటపడిపోతున్నారు. బన్నీ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు మొత్తం ఏడు భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

తెలుగు కాకుండా తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్ పురి వంటి భాషల్లో చిత్రం అనువాదం కానుంది. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా విశాల్, శేఖర్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 27న సినిమా రిలీజవుతుండగా ఈ జనవరి 26న ఆల్బమ్ లోని ‘సైనిక’ అనే పాటను విడుదలచేయనున్నారు.