నాకోసం లిరికల్ వీడియో కి సూపర్ రెస్పాన్స్!

Published on Dec 7, 2021 4:00 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నాకోసం అంటూ ఒక లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం తో మరింత హైప్ పెరిగింది అని చెప్పాలి. ఈ పాట ఒక్క రోజులోనే 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :